WNP: హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 15 ఏళ్లు చేరిన బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలన్నారు. మహిళలకు HPV వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు.