MBNR: నవాబుపేట మండలం కిష్టంపల్లిలో సురేష్ (22) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. సురేష్ ప్రైవేట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని చెట్టుకు తాడుతో ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.