NGKL: పెంట్లవెల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో గదులు శుభ్రం చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో చీపుర్లు పట్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ స్పందిస్తూ.. విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.