ADB: సిరికొండ మండలంలోని జైతూగూడ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక ఆదివాసీ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా పోలీసు యంత్రాంగం సామాజిక బాధ్యతగా గ్రామంలో 22 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి గ్రామం నుంచి అంధకారాన్ని తొలగించారు. దీంతోపాటు 3 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన్ని సైతం బాగుచేసిన పోలీసులు గ్రామస్తుల మన్ననాలు పొందారు.