VKB: గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దే వెలుగులు లేకపోతే ఇక ఊరి పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నెల రోజులుగా వీరశెట్టిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లే దారిలో, కార్యాలయ పరిసరాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. దీనివల్ల రాత్రి వేళల్లో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.