NRML: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అక్కడ యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో MLA మాట్లాడుతూ.. ఇతర పార్టీల్లాగా మతాలు, కులాల పేర్లు చెప్పి మేము ఓట్లు అడగమని, మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం అబివృద్ధి చెందుతుందని అన్నారు.