SRPT: తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అది సోమసూత్ర శివలింగమని గ్రామస్థులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కనే అనంతారం గ్రామం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పురాతన విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పూజలు చేస్తున్నారు.