MBNR: మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మేజర్ గ్రామపంచాయతీ కోడూరు గ్రామపంచాయతీలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సరస్వతి రాజు గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి తమ లక్ష్యం అని వెల్లడించారు. గ్రామంలో సమస్యలు పరిష్కారానికి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి కృషి చేస్తామని పేర్కొన్నారు.