NZB: మోస్రా మండల కేంద్రానికి చెందిన శారదకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు.108 సిబ్బంది అంబులెన్సులో తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవించింది. అంబులెన్సు సిబ్బంది ప్రసవం చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. తల్లి బిడ్డలను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు టెక్నీషియన్ లలిత తెలిపారు.