NLG: ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి పెళ్లికి సిద్ధమైన పనస మధు అనే కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెరువుపల్లికి చెందిన మధు, తాను FCIలో పని చేస్తున్నానని అబద్ధం చెప్పి ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఏకంగా రూ. 1.50 కోట్ల కట్నానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని వేధించడంతో అనుమానం వచ్చి నిలదీయగా, అసలు విషయం బయటపడింది.