HYD: ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు వేల మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇంత మందికి నిమ్స్ అత్యాధునిక వైద్యం అందిస్తోంది. అందుకే కార్పొరేట్ కంపెనీలు కూడా నిమ్స్‌కు బాసటగా నిలుస్తున్నారు. అత్యాధునిక యంత్రాలకు విరాళాలు ఇచ్చి రోగులను ఆదుకుంటోంది. గత సంవత్సరం దాదాపు రూ. 57 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు.