NLG: దేవరకొండ మండలం శక్రుతండా గ్రామ పంచాయతీలో శుభ్రత పనులు చేపట్టారు. సర్పంచ్ మోహన్ లాల్ దగ్గరుండి పనులు చేయించారు. దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు జ్యోతి, చిన్ని, చరణ్, సేవ్యా, గన్య, పాండు, మంగి, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.