కృష్ణా: ఘంటసాల పరిధిలోని శ్రీకాకుళం బాలికల వసతి గృహంలో విద్యార్థినీల శ్రేయస్సే లక్ష్యంగా సమావేశం శుక్రవారం నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ పీ. జ్ఞానసుందరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘మన వంతు’ సంకల్పం ద్వారా విద్యార్థినీలకు టేబుల్ ఫ్యాడ్లను తాడికొండ చిన్నా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బీ. విజయ ప్రసాద్, చల్లపల్లి సీఐ ఈశ్వరరావు పాల్గొన్నారు.