ELR: బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయలని భీమడోలు ICDS ప్రాజెక్ట్ అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం వెలుగు కార్యాలయంలో ఇవాళ మండల సమాఖ్య సభ్యులకు బాల్యవివాహాలు నిరోధించడంపై అవగాహన సదస్సు జరిగింది. APM ప్రభావతి, సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, శారదా మణి ఉన్నారు.