కర్నూలు: భారతీయ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతిని పురస్కరించుకుని SFI ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఇవాళ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలికల విద్య కోసం సావిత్రిబాయితో కలిసి ఫాతిమా షేక్ చేసిన సేవలు ఆదర్శనీయమని, ఎన్నో అవమానాలు ఎదురైనా ఆమె లక్ష్యాన్ని వదలలేదని తెలిపారు.