BDK: ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం కోటియా నాయక్ తండాలో గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుగులోతు ధర్మ నాయక్ రెండవ వర్ధంతిని గ్రామస్తులు ఇవాళ నిర్వహించారు. కార్యదర్శి భూక్య హరి నాయక్ ధర్మ నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరించే మహనీయుడు అని కొనియాడారు.