VZM: వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భోగాపురం మండలం పోలిపల్లిలో విద్యార్థులు వందేమాతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వందేమాతరం గీతం ఆలపించారు. ఏపీ మార్క్ఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర పోరాటంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణనినాదంలా మారిన వందేమాతరం గీతం పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు.