HYD:హైడ్రా సమక్షంలో HYD ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేసిన హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి కమిషనర్ ఏవీ రంగనాథ్ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్, అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, DRF అధికారులు జయప్రకాష్, యజ్ఞ నారాయణ, గౌతం, మోహన్, DRF సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.