WGL: నెక్కొండ పట్టణ కేంద్రంలోని రామాలయం వీధిలో సింగం శ్రావణి-ప్రశాంత్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ భూమి పూజ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రావు హరీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.