SRPT: జిల్లా కేంద్రానికి చెందిన గ్రీన్ క్లబ్ ట్రస్టు కొన్నేళ్లుగా ప్లాస్టిక్ భూతంపై సమరం సాగిస్తోంది. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, దేశంలోనే మొట్టమొదటిసారిగా బుధవారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో 15 అడుగుల ప్లాస్టిక్ భూతాన్ని గ్రీన్ క్లబ్ ట్రస్టు సభ్యులు ప్రదర్శించారు.