KNR: జమ్మికుంట పరిసర ప్రజలకు సుపరిచితులైన విశ్రాంత వైద్యాధికారి డా. జీడి అంకూస్ ఆదివారం హార్ట్ స్ట్రోక్తో జమ్మికుంటలోని అతని స్వగృహంలో కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు అందజేశారు. ఇదే విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది మైస అరవింద్ ఓ ప్రకటనలో తెలిపారు. పేద ప్రజలకు ఆయన సేవలు మరువలేనివని అరవింద్ గుర్తు చేశారు.