SRCL: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీకి మల్యాల గ్రామంలో శ్రీకారం చుట్టామన్నారు.