KMR: బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. గాంధారి మండల కేంద్రంలో శివ దత్త సేవా సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేసి, రక్షించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం కోసం పాటుపడే హిందువుల ఆగ్రహానికి గురికావద్దని హెచ్చరించారు.