SRPT: ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ఏఐఈఈఏ PG ప్రవేశ పరీక్షలో జాజిరెడ్డిగూడెం వాసి మద్దెల యామిని ఉత్తమ ప్రతిభ చూపింది. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన డా.మద్దెల రవి – సంధ్యల కుమార్తె యామిని జాతీయ స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ (మృత్తిక శాస్త్రం) విభాగంలో ఆల్ ఇండియా 63వ ర్యాంక్ సాధించింది. ఆమెను పలువు అభినందించారు.