VKB: పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి రేపు ఉదయం 9 గంటలకు మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా 1200 ఎకరాల భూమిని కోల్పోతున్న కాడ్లాపూర్, రాపోల్ గ్రామ రైతులను ఆయన పరామర్శించనున్నారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.