SRD: నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి సాయపడేలా అధికారులు సరికొత్త (QR Code) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. సంగారెడ్డి-అకోలా హైవేపై అక్కడక్కడా స్కాన్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీన్ని స్కాన్ చేస్తే సమీపంలోని టోల్ ప్లాజా దూరం, మేనేజర్ వివరాలు తెలుస్తాయి. అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, తదితర సమాచారం లభిస్తుంది.