మెదక్ జిల్లా రామాయంపేటలోని అశోక్ సింగల్ శిశుమందిర్‌లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ‘కూరగాయల సంత’ ఆకట్టుకుంది. 5 నుంచి 10 ఏళ్ల విద్యార్థులు వ్యాపారులుగా మారి కూరగాయలు అమ్ముతూ మార్కెట్ విధివిధానాలపై అవగాహన పొందారు. రైతు కష్టం, క్రయవిక్రయాల గురించి ప్రాక్టికల్‌గా నేర్పడమే లక్ష్యమని స్కూల్ కమిటీ అధ్యక్షులు పడకంటి, కార్యదర్శి పండరినాథ్, ప్రధాన ఆచార్య కవి తెలిపారు.