NZB: ఎడపల్లి మండలం జాన్కంపేట్ ZPHSలో మహిళా సాధికారత కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ పేరుతో బాలికలకు కరాటే విద్యను నేర్పుతున్నారని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఆడపిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వెల్లడించారు.