MNCL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజాసంబంధిత అంశాలతో పాటు ఇతర కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కేంద్రం యొక్క తోడ్పాటు అందించాలని కోరారు.