NZB: మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించేది లేదని ఫైన్, జైలు శిక్షకు గురికాక తప్పదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం హెచ్చరించారు. న్యూయర్ వేడుకల్లో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు నడిపిస్తే రూ.10 వేలకు మించిన ఫైన్‌తో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.