SRD: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో ఇఫ్తార్ విందు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముస్లింలు రంజాన్ మాసాన్ని అతి పవిత్రంగా భావిస్తారని చెప్పారు. అనంతరం ముస్లింలు ఉపవాస దీక్షను విరమించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.