SRPT: నూతనకల్ మండలం ఎర్రపహాడ్కి చెందిన దేశ్ ముఖ్ జెన్నారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి గుండెపోటుతో మరణించడంతో శనివారం జూబ్లీహిల్స్లో ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిశోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు దయాకర్ రెడ్డి, వెంకటనారాయణ గౌడ్ ఉన్నారు.