SRCL: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఆదివారం ఉ. 11 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 4,046 మంది, ద్వితీయ సంవత్సరంలో 4060 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు సూచించారు.