NLG: పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల మరియమాత ఉత్సవాలు బుధవారం రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు ఉత్సవాలలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే మరియమాత ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.