కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా బుధవారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎడ్ల బండిపై సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్రాంతి ప్రత్యేకించి రైతాంగానికి సంబంధించిన ప్రధాన పండుగని పేర్కొన్నారు. కనుమ పండుగ రోజు పశువులను పూజించే సాంప్రదాయం మన తెలుగువారిదన్నారు.