RR: షాద్‌నగర్‌లోని జడ్చర్ల రోడ్డులో గల IDBI ఏటీఎంలో ఆగస్టు 5న డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన రాజును దొంగల ముఠా మోసం చేసింది. రాజును మోసం చేసి కార్డు మార్చి రూ.2,42,400 నగదును దండుకున్నారు. కాగా.. ఈ అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్, షాద్‌నగర్ పోలీసుల సహకారంతో బుధవారం అరెస్ట్ చేశారు. ముఠాను పట్టుకొని రూ. 2,38,000 నగదు, 14 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.