BNR: చైనా మాంజాదారం తగిలి బైక్పై వెళ్తున్న దంపతులకు గాయాలైనఘటన బుధవారం యాదగిరిగుట్టలో జరిగింది. స్థానికుల వివరాలిలా..దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చైనా మాంజా దారంతగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతుతెగింది. అతడి భార్య వాహనంపై నుంచి పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు భువనగిరి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.