GNTR: తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న ఓ వైన్ షాపు వద్దకు వచ్చిన కారు అదుపుతప్పి ప్రక్కనే ఉన్న నివాసంలోకి దూసుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. కాగా ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం ఉండటం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.