BHPL: జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణా నియమాలు ఉల్లంఘించే వారిపై, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లో ఒరిజినల్, డూప్లికేట్ కూపన్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. లోడింగ్ తర్వాత అధికారి సంతకంతోనే రవాణా చేయాలని, పర్మిషన్ కాపీ లేకుంటే చర్యలు తప్పవని తెలిపారు.