TG: BJP జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ముఖ్య నేతలు సునీల్ బన్సల్, BL సంతోష్‌తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన ముగ్గురు అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి అందించనున్నారు. పార్లమెంటరీ పార్టీ బోర్డులో చర్చ అనంతరం BJP అభ్యర్థిని ప్రకటించనుంది.