AP: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఎక్సైజ్ పోలీసులు ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్(A21)ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షలు చేయించి ములకలచెరువు తహశీల్దార్ ఎదుట హాజరుపరిచారు. అటు జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.