SRD: కల్హేర్ మండల వ్యాప్తంగా క్రిష్ణాపూర్ మాసాన్‌పల్లి ,మార్డి, , బిబిపేట్ గ్రామాలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘాలు, దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు రాజ్యాంగ పీఠిక చదివి వినిపించారు. కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు.