SRCL: చెడుపై మంచి సాధించిన విజయంగా దసరా (విజయదశమి) జరుపుకుంటారని రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ విప్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ శమీ పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలయ్ బలాయ్ తీసుకొని, పెద్దల ఆశీర్వాదం తీసుకొని శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.