KMR: పాల్వంచలోని ఫరీద్‌పేట్ గ్రామంలో నూతన గ్రంథాలయం బుధవారం ప్రారంభమైంది. జీడిపల్లి నర్సింహా రెడ్డి తన కూతురు, తండ్రి స్మారకార్థం రూ. 20 లక్షల సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, యువకులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.