MDK: మెదక్ నుంచి ముక్త భూపతిపూర్ వెళ్లే తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు నిర్మాణాన్ని నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో వర్షాలు, వరదల కారణంగా బ్రిడ్జి దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.