NGKL: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ గోడ పత్రికను అచ్చంపేట ZPHS పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవిష్కరించారు. ఈనెల 7న పాఠశాల స్థాయిలో, 21న మండల స్థాయిలో, 28 జిల్లా స్థాయిలో డిసెంబర్ 12, 13వ తేదీలల్లో రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారు.