HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.