MDCL: చాకలి ఐలమ్మ ఓ పోరాట యోధురాలని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావుతో కలిసి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బాలాజీనగర్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుందని పేర్కొన్నారు.