KNR: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అధికారులతో వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ మళ్లింపు, రూట్ మ్యాపింగ్, విద్యుత్ జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.