HYD: జనవరి ఒకటి నుంచి ప్రారంభమయ్యే ‘నుమాయిష్’కు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏటా 46 రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నిర్వహిస్తారు. 84వ ప్రదర్శనకు ఇప్పటికే స్టాళ్ల కేటాయింపు పూర్తయ్యింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.